మంగళవారం, 15 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఏప్రియల్ 2025 (12:28 IST)

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

Woman Police - Blue shirt
Woman Police - Blue shirt
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఆందోళన పాల్గొన్న వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వైరల్ అయ్యేందుకు ఏముంది అనుకునేరు. ఈ వీడియోలో ఆందోళనకారులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసులు. 
 
ఇందులో మహిళా పోలీసులు కూడా వున్నారు. ఓ మహిళా పోలీసు ఆందోళనకారుడి చొక్కా పట్టుకుని లాక్కెళ్తుండగా.. ఆందోళనకారుల్లో మరొకడు మహిళా పోలీస్ నడుము పట్టుకున్నాడు. ఆమెను ఆందోళనకారులను అరెస్ట్ చేయకుండా నియంత్రించేందుకు ప్రయత్నించాడు. 
 
మహిళా పోలీస్ నడుము పట్టుకుని, బెల్టు పట్టుకున్నాడు. అయితే దీన్ని గమనించిన మహిళా పోలీసు అతడిని చెయ్యి పట్టుకుని ముందు పోలీసు బండి ఎక్కించింది. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు నడుము పట్టుకుని బులుగు చొక్కా వేసుకున్న వ్యక్తిపై సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. వీడి మామూలోడు కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.