Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తమన్నా పాటకు డ్యాన్స్ ఇరగదీసిన వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

Written By సెల్వి
Updated: గురువారం, 13 ఫిబ్రవరి 2020 (11:13 IST)
ఏపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి చేసిన టిక్ టాక్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ చెందిన వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఒక పాఠశాలకు చెందిన వార్షికోత్సవంలో తమన్నా పాటకు చిందేశాడు. తమన్నా, హీరోయిన్‌గా నటించిన హిమ్మత్‌వాలా సినిమాలోని ''నైనో మే సప్నా'' పాటకు ఓ రేంజ్‌లో డాన్స్ ఇరగదీసాడు. 
 
ఒరిజినల్‌గా ఈ పాటను రాఘవేంద్రరావు దర్శకత్వలో తెరకెక్కిన ‘హిమ్మత్‌వాలా’ సినిమాలో శ్రీదేవి, జితేంద్రలపై పిక్చరైజ్ చేసారు. ఈ పాట అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ సంచలనమే. ఆ తర్వాత ఇదే సినిమాను అదే టైటిల్‌తో అజయ్ దేవ్‌గణ్, తమన్నా హీరో, హీరోయిన్లుగా సాజిద్ ఖాన్ తెరకెక్కించాడు. అందులో అదే పాటను అదే ట్యూన్‌తో అజయ్ దేవ్‌గణ్, తమన్నాలపై రీమిక్స్ చేసారు.
 
ఈ రీమిక్స్ పాట హిట్టైనా.. సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. మొత్తానికి అప్పట్లో శ్రీదేవి, ఇప్పట్లో తమన్నాలపై పిక్చరైజ్ చేసిన ఈ పాటకు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు  చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments