ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 10 అక్టోబరు 2018 (17:29 IST)

ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ 'ఆకు చాటు పిందె'

నందమూరి తారక రామారావు నిజ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటీనటులను సెలక్ట్ చేసి షూటింగ్ కూడా ప్రారంభించేశారు. అనుకున్న నటులకు బదులు కొంతమంది వేరే నటులను మార్చి సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో అలనాటి నటి శ్రీదేవి క్యారెక్టర్‌ను రకుల్ ప్రీత్ సింగ్ చేస్తోంది.
తనకు ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందంటోంది రకుల్ ప్రీత్ సింగ్. శ్రీదేవిలా నటించడానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. నాపై నమ్మకం ఉంచి ఆ క్యారెక్టర్‌ను అప్పగించిన సినిమా యూనిట్‌కు ధన్యవాదాలు చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్. 
ఇప్పటికే సినిమాలోని ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడా చిత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. క్యూట్‌గా కనిపిస్తున్న రకుల్ అచ్చం శ్రీదేవిలాగానే ఉందంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో యువత తెగ షేర్ చేసేస్తున్నారు.