శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 19 జూన్ 2020 (18:38 IST)

ఏపీ రాజ్యసభ 4 సీట్లూ వైసిపికే, చెల్లని తెదేపా 4 ఓట్లు

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపి ఘన విజయం సాధించింది. మొత్తం 4 సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటింది. వైసీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు విజయం సాధించారు.
 
గెలుపొందిన ఒక్కో అభ్యర్థికి 38 ఓట్లు రాగా తెదేపా తరపున పోటీ చేసిన వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. 4 ఓట్లు చెల్లలేదు. చెల్లని ఆ నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీకి చెందినవి కావడం గమనార్హం.