శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 11 మే 2017 (15:58 IST)

బీరువాపై ఎప్పుడూ దేవుని ఫోటోలు అతికించకూడదు.. ఎందుకో తెలుసా?

ఇంట్లో బీరువా ఏవిధంగా ఉంటే శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. మీ ఇంట్లో ఉండే బీరువా ఏ ముఖాన వుందో తెలిస్తే.. ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఏ మేర వుందో చెప్పేయవచ్చు. మనం వాడే డ

ఇంట్లో బీరువా ఏవిధంగా ఉంటే శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. మీ ఇంట్లో ఉండే బీరువా ఏ ముఖాన వుందో తెలిస్తే.. ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఏ మేర వుందో చెప్పేయవచ్చు. మనం వాడే డబ్బును, బంగారు ఆభరణాలను, కీలక పత్రాలను బీరువాలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ బీరువా లక్ష్మీదేవి అనుగ్రహం లభించే దిశలో ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
బీరువా ఎప్పుడూ నైరుతిలోనే ఉండాలి. నైరుతి అంటే దక్షిణానికి పడమరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. బీరువా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ వుండాలి. ఇక బీరువా తెరవగానే చక్కని సువాసన రావాలి. అంతేకానీ పాతబట్టల వాసన లేదా బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసనా రాకూడదు. అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం చేదు. కుబేర ముగ్గును నీలం రంగు పెన్నుతో వేసి ఆ ముగ్గును బీరువా లోపలి అరలో పెట్టుకోవాలి.
 
ఈ ముగ్గుకు నాలుగు వైపులా పసుపు, కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ కుబేరముగ్గు మీద బంగారాన్ని, డబ్బును పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. బీరువాలో పూజా సామగ్రి దుకాణంలో అమ్మే వట్టివేళ్లు (చెట్టువేళ్లు) తీసుకుని, పచ్చకర్పూరము సుగంధ ద్రవ్యాల్ని ఒక వెండి కప్పులో కానీ, రాగి కప్పులో కానీ పెట్టుకుని బీరువాలో పెట్టుకోండి. దానివల్ల ధనవృద్ధి జరుగుతుంది.
 
బీరువాపై ఎప్పుడూ దేవుని  ఫోటోలు అతికించకూడదు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరుపతిలో అమ్మేటువంటి ఇనుప స్టిక్కర్లు బీరువాలపై అంటించకూడదు. ఎందుకంటే బీరువా పడకగదిలో ఉంటుంది కాబట్టి, పడకగదిలో ఉండే బీరువాపై దేవుడి ఫోటోలు ఉండకూడదు. ఎప్పుడూ కూడా బీరువాపై ఓ వైపు శుభం లాభం ఇంకో వైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి. ఆ స్వస్తిక్ కూడా అపసవ్య స్వస్తిక్ కాదు.

సవ్య స్వస్తిక్ అని, అవి కూడా పసుపు రంగులో కుంకుమ తోటి బొట్లు పెట్టినటువంటిదై వుండాలి. ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.