వీధిపోటుతో లాభాలు కూడా ఉంటాయా?

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఎదురుగా నిలువుగా ఉన్నవీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా, లేదా ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటు ఉన్న ఇల్లు అంటారు. వీధిపోటు ఉన్న ఇల్లు బొత్తిగా నివాసయోగ్యం కాదనీ, ఆ ఇంట కాపురముండి వారు అష్టకష్టాలు పడతారని చాలామంది అపోహపడుతు

శనివారం, 19 నవంబరు 2016 (12:24 IST)
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఎదురుగా నిలువుగా ఉన్నవీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా, లేదా ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటు ఉన్న ఇల్లు అంటారు. వీధిపోటు ఉన్న ఇల్లు బొత్తిగా నివాసయోగ్యం కాదనీ, ఆ ఇంట కాపురముండి వారు అష్టకష్టాలు పడతారని చాలామంది అపోహపడుతుంటారు. ఈ అపోహల మూలంగా నిరంతరం మానసిక అశాంతికి గురై తక్కువ ధరకే ఇల్లు అమ్ముకుపోయేవారు కొందరైతే , రిపేర్ల పేరిట బోలెడంత డబ్బు ఖర్చు చేసి ఆర్ధికంగా నష్టపోతుంటారు. అయితే నిజానికి ఏ దిశలో వీధిపోటు ఉన్నాడనే అంశం మీదే ఆయా ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
 
ఇంటికి తూర్పు మొగ్గున్న ఈశాన్య వీధిపోటు సానుకూల ఫలితానిస్తుంది. ఈ ఇంటిలోని పురుషులు ఇంటా బయటా చక్కని గౌరవం, అధికారాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ తమ రంగాల్లో అత్యున్నత విజయాలను సాధిస్తారు. ఇంటికి ఉత్తరం మొగ్గున్న ఈశాన్య వీధిపోటు కూడా మంచిదే. ఈ ఇంటిలోని స్త్రీలు అన్నివిధాలా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని చీకూ చింతా లేకుండా జీవితాన్ని గడపటమే గాక కుబేర అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటికి ఉత్తరం మొగ్గున్న వాయువ్య వీధి పోటు ఉంటే ఆ కుటుంబంలో ఉన్న యుక్తవయస్కులకు పెళ్లి కుదరకపోవటం, కుదిరినా ఆగిపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ ఇంటి మహిళలు అనైతిక విషయాల పట్ల ఆకర్షితులు కావటంతో బాటు ఎప్పుడూ ఏవో తెలియని సమస్యలతో జీవితాన్ని గడపాల్సివస్తుంది.
 
ఇంటికి పడమర వైపు మొగ్గున్న వాయువ్య మూలన వీధిపోటు ఉంటే ఆ ఇంట అన్నీ సానుకూల ఫలితాలే. ఆ యజమాని కీర్తిని, ధనాన్ని ఆర్జిస్తాడు. అందరి ఆమోదాన్ని పొందిన వ్యక్తులుగా వీరు రాజకీయాల్లో చక్కని రాణింపును పొందుతారు. ఇంటికి పడమర మొగ్గున్ననైరుతి వీధిపోటు ఉన్న ఇంట ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనం మాత్రం ఉండదు. ఇంటికి దక్షిణం మొగ్గున్ననైరుతి వీధిపోటు కూడా అశుభాలకే దారి తీస్తుంది. దంపతుల మధ్య కలహాలు, ఆ ఇంట ఉండే స్త్రీలకు ఎప్పుడూ ఏదో ఒకరకమైన అనారోగ్యం ఉంటాయి. 
 
తలపెట్టిన ప్రతిపనిలోనూ అవాంతరాలను ఎదుర్కొంటారు. ఇంటికి దక్షిణం మొగ్గున్న ఆగ్నేయ వీధిపోటు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ ఇంట కాపురముండే కుటుంబం తృప్తికరంగా, సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ ఇంటివారు బంధువులను చక్కగా ఆదరిస్తారు. ఈ ఇంట తలపెట్టిన ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా జరుగుతుంది.ఇంటికి తూర్పు మొగ్గున్నఆగ్నేయ వీధి పోటు అనేక సమస్యల్ని సృష్టిస్తుంది. మానసిక అశాంతి, ఆదాయానికి మించిన ఖర్చులు , కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వంటి సమస్యలకు కారణమవుతుంది.

అన్నీ చూడండి

గోవులను ఎక్కడకు తరలిస్తున్నారు... బర్త్ సర్టిఫికేట్ ఉందా? బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్న

కూటమికి మద్దతిస్తాను.. అందుకని పూర్తిగా లొంగిపోయినట్లు కాదు.. పవన్ కల్యాణ్

జనాభా ఒక ఆస్తి-భారం కాదు: చంద్రబాబు మూడు, నాలుగు సంతానానికి ప్రోత్సాహాకాలు ఎందుకంటే?

ఈ కట్టె కాలేంత వరకు మీతోనే కళ్యాణ్ సర్ : నటుడు తనీష్ ఎమోషనల్ ట్వీట్

Put Chutney యూ ట్యూబర్ నుంచి విజయ్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా రాజ్ మోహన్

అన్నీ చూడండి

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

తర్వాతి కథనం
Show comments