బేబీకార్న్‌తో కుర్మా ట్రై చేయండి.. చపాతీలకు భలే కాంబినేషన్

సోమవారం, 28 సెప్టెంబరు 2015 (14:11 IST)
జీర్ణక్రియను మెరుగుపరిచే బేబీ కార్న్ కొవ్వును నియంత్రిస్తుంది. చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి బేబీ కార్న్‌తో కుర్మా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలకు ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
బేబీ కార్న్ - రెండు కప్పులు
నూనె - సరిపడా
ఉల్లి తరుగు - ఒక కప్పు
టమోటా తరుగు - ఒక కప్పు 
పెరుగు-ఒక కప్పు, 
మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు,
కొత్తిమీర-రెండు రెమ్మలు
ఉప్పు, కారం-తగినంత
చక్కెర-చిటికెడు, 
పసుపు-అరచెంచా,
పచ్చిమిర్చి-మూడు
 
తయారీ విధానం : 
ముందుగా ముక్కల్ని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కనబెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో నూనె పోసి ఉల్లి, పచ్చిమిర్చి, టమోటా తరుగు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత ఉడికించిన కార్న్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, చక్కెర వేసి మూతపెట్టాలి.

ఐదు నిమిషాల తరువాత దానిలో తగినంత నీరు చేర్చి పావు కప్పు పెరుగు చేర్చుకోవాలి. ఈలోగా మొక్కజొన్న పిండిని రెండు చెంచాల నీటితో జారుగా కలుపుకోవాలి. దీన్ని కూడా బేబీ కార్న్ ముక్కలకు పట్టించాలి. గ్రేవీలా తయారయ్యాక దించేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే.. బేబీ కార్న్ కుర్మా రెడీ.

అన్నీ చూడండి

భాష అనేది ఒక చాయిస్ మాత్రమే.. బలవంతంగా రుద్దలేం...

కడప జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావం - రిమ్స్‌ ఆస్పత్రికి తరలింపు

సుగాలి ప్రీతి హత్య కేసు దర్యాప్తును ఏపీ సర్కారు నిర్లక్ష్యం చేసింది.. జగన్ ఫైర్

బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు చీమల బారుల్లా వెళ్లిపోతున్న బంగ్లాదేశీయులు, వీడియో

కన్నతల్లినే పక్కలోకి రమ్మన్న కామాంధ కొడుకు, పళ్లతో కొరికి, తలపై కొట్టి, వీడియో

అన్నీ చూడండి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్

Jagapathi Babu: ప్రోస్థెటిక్ మేకప్ తో చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి : జగపతి బాబు

Show comments