కాలీఫ్లవర్ పులావ్ తినండి.. క్యాన్సర్‌ను దూరం చేసుకోండి..!

సోమవారం, 4 జనవరి 2016 (16:53 IST)
కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే కాలీఫ్లవర్లో విటమిన్ సి, లోఫ్యాట్, పుష్కలంగా ఉండి క్యాన్సర్‌తో పోరాడుతుంది. కాలీఫ్లవర్ సాధారణంగా ఎక్కువ మొత్తంలో ఫైబర్'లను కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్లూకోరపిన్‌ను కలిగి ఉండి, జీర్ణాశయ లోపలి గోడలను క్యాన్సర్ కారకాల నుండి, ఇతర హానికర కారకాల నుండి కాపాడుతుంది. అంతేకాదు కాలీఫ్లవర్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్‌లు శరీరంలో క్యాన్సర్ కలుగచేసే క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ శీతాకాలంలో దొరికే కాయగూరలలో కాలీఫ్లవర్ ఒకటి. ఆయా సీజన్‌లో దొరికే  కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాలీఫ్లవర్ రుచికరమైనది మాత్రమే కాదు. ఆరోగ్యప్రయోజనాలను కూడా అధికంగా కలిగిఉంది. అలాంటి హెల్త్ బెనిపిట్స్ కలిగివున్న కాలీఫ్లవర్‌తో రుచికరమైన పులావ్ ఎలా చేయాలో చూద్దాం..
 
కావల్సిన పదార్థాలు: 
 
బాస్మతి రైస్: 2 కప్పులు
కాలీఫ్లవర్: 1 
క్యారెట్ : 2 
బీన్స్ : 2
బటానీలు: 1 కప్పు
జీలకర్ర పొడి: తగినంత
గరం మసాలా పొడి : 2 స్పూన్
పెప్పర్ పౌడర్ : 1 స్పూన్
జీలకర్ర :  1 స్పూన్
దాల్చిన చెక్క: 2 
యాలకులు : కొద్దిగా 
బిర్యానీ ఆకులు : 2
ఉల్లిపాయ: 2 పెద్దవి
టమోటో: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: తగినంత
పచ్చిమిర్చి: 4 
పసుపు: తగినంత
కారం: సరిపడా
నెయ్యి : 5  స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
 
తయారీ విధానం: ముందుగా బియ్యంని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పాత్రలో అన్నికూరగాయలను సగానికి ఉడికించుకోవాలి. తర్వాత స్టౌమీద పాత్ర పెట్టి, అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, వేసి కొన్నివేయించాలి. వేయించిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, ఉడికించిన కూరగాయలు వేసి కలియబెట్టాలి. 
 
ఆ తరువాత పెప్పర్ పౌడర్, గరం మసాలా, టమోటో, పసుపు, కారం,జీలకర్ర పొడి వేయాలి. ఇవన్నిమగ్గిన తరువాత బాస్మతి రైస్ కూడా వేసి, రెండు, మూడు నిముషాలు ఫై చేయాలి. ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, మూత పెట్టి 15 నిముషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే కాలీఫ్లవర్ పులావ్ రెడీ.

అన్నీ చూడండి

దేశంలో భానుడి భగభగలు... పౌరులకు ప్రధాని మోడీ సూచనలు

మహానాడు విధానం, స్ఫూర్తి మారలేదు.. కార్యకర్తలే బలం, బలగం.. చంద్రబాబు

2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. నారా లోకేష్ (video)

మంటగలిసిపోతున్న కుటుంబ విలువలు.. భార్యాబిడ్డల్ని హత్యచేసి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం

అన్నీ చూడండి

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Show comments