Festival Posters
✕

కార్న్ పకోడి తయారీ విధానం

Updated: మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:33 IST)
పాఠశాలలకు వెళ్లే పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తూనే చిరుతిండ్లు కావాలని మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ కార్న్ పకోడి చేసి పెట్టండి. హేపీగా లాగించేస్తారు.

కావలసిన వస్తువులు
బేబీ కార్న్- పది, సెనగపిండి- ముప్పావుకప్పు, పసుపు- పావుటీస్పూన్, కారం- అరటీస్పూన్, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, ఛాట్ మసాలా- కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒకటీస్పూన్, జీలకర్రపొడి- అరటీస్పూన్, ధనియాల పొడి- ఒకటీస్పూన్.
తయారీ విధానం
ముందుగా బేబీకార్న్ కండెలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నీళ్లలో కాసేపు ఉడికించాలి. తరువాత నీళ్లు తీసేసి కార్న్ పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి తీసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
 
ఈ మిశ్రమంలో ఉడికించిన కార్న్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ కార్న్ ముక్కలు వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. ఛాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.

అన్నీ చూడండి

తండ్రి కష్టపడి చదివిస్తే.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జీవితాన్ని పాడుచేసుకున్నా...

ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ పోల్ : బ్యాలెట్ ఓట్లలో కూటమి ఆధిక్యం

రాప్తాడు ఘటన ఉన్మాది హేమంత్ కుడికాలు తొలగింపు

తుఫాను రాకకు ముందే.. 17 జిల్లాలకు రూ.37 కోట్లు కేటాయించిన ఏపీ

Cyclone Murasu: చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అన్నీ చూడండి

Poonam Kaur: త్రివిక్రమ్‌ను నకిలీ గురువు అంటూ ఏకేసిన పూనమ్ కౌర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలని కోరిన మెగాస్టార్ చిరంజీవి

Rashmika: రష్మిక మైసా నుంచి మహిళా శక్తిని చాటే పవర్‌ఫుల్ ఆంథమ్‌ ఓ మైసా రే రిలీజ్

Deepika Padukone: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె మూవీ కింగ్ నుంచి పాప్ సాంగ్‌

Rahul Vijay: డార్క్ క్రైమ్ జానర్‌లో అ (AH) చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments