గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (18:51 IST)

వర్షాకాలానికి దివ్యౌషధం పసుపు.. ఎముకల్లో క్యాన్సర్ మటాష్

పసుపు వర్షాకాలంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో ఒక్కసారిగా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి నీరసం, జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. ఇలాంటి రుగ్మతలను పసుపు దూరం చేస్తుంది. పసుపు, తేనె, కొబ్బరినూనె ఈ మూడింటి మిశ్రమం శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదం చేస్తాయి. 
 
కొబ్బరిపాలు, తేనె, పసుపును కలిపి చేసుకున్న పానీయాన్ని తాగడం ద్వారా వర్షాకాలంలో సహజంగా వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడే వీలుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పసుపులోని ప్రధాన పదార్థమైన కర్కుమిన్‌తో రూపొందించిన కొత్త ఔషధ బట్వాడా వ్యవస్థ ఎముక క్యాన్సర్‌ కణాల వృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని పరిశోధనలో తేలింది. 
 
చిన్నారుల్లో చోటుచేసుకునే క్యాన్సర్‌ మరణాల్లో రెండో అతిపెద్ద కారకంగా ఎముక క్యాన్సర్‌‌ను ఇది దూరం చేస్తుంది. పసుపును శతాబ్దాలుగా ఆసియా దేశాల్లో వంటలో, వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అందులోని కర్కుమిన్‌కు యాంటీ యాక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతోపాటు, ఎముక నిర్మాణ సామర్థ్యాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడి అయ్యింది.