పనీర్‌తో బిర్యానీ ఎలా చేయాలి?

శుక్రవారం, 18 జులై 2014 (16:57 IST)
పనీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీనులు పుష్కలంగా ఉండే పనీర్‌ను తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన క్యాల్షియం, ఫాస్పరస్ అందుతుంది. ఇది దంతాలను, ఎముకలను బలపరుస్తుంది. పిల్లల్లో దంతాలు, ఎముకల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. 
 
కావలసిన పదార్థాలు : 
పనీర్ ముక్కలు - అర కప్పు 
బాస్మతి రైస్ - ఒక కప్పు 
ఉప్పు - తగినంత  
పెరుగు - ఒక టీ స్పూన్ 
నూనె - తగినంత 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్ 
నెయ్యి - రెండు టీ స్పూన్ 
జీడిపప్పు - పావు కప్పు  
 
పేస్ట్ కోసం..
కొబ్బరి తురుము - ఆరు టీ స్పూన్లు 
పచ్చి మిర్చి - రెండు 
పుదీనా - పావు కప్పు 
కొత్తిమీర- అర కప్పు 
టమోటా - ఒకటి  
 
తాలింపుకు.. 
దాల్చిన చెక్క, గసగసాలు- ఒక టీస్పూన్  
 
తయారీ విధానం :
స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, గసగసాలు దోరగా వేపుకోవాలి. అలాగే పేస్ట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, టమోటా పేస్ట్‌ను వేసి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులో పెరుగు కూడా చేర్చుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ చేర్చి రెండు కప్పుల నీరు పోసి ఉడికించాలి. 
 
తర్వాత పనీర్ ముక్కలను వేరొక బాణలిలో లైట్‌గా ఫ్రై చేసి పక్కన బెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఉడికాక జీడిపప్పు, వేపిన పనీర్ ముక్కలను కలిపి హాట్ హాట్‌గా మష్రూమ్ గ్రేవీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

అన్నీ చూడండి

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

Show comments