suvichar
✕

ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర పప్పు ఎలా చేయాలి?

ఆకుకూరల్లో ప్రధానం పాలకూర. పాలకూరలో పోషకాలు సమృద్ధిగా వుంటాయి. విటమిన్‌ ఏ, సీ, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియంలు అధిక మోతాదులో ఉన్నాయి. అలాగే ఇందులో పదమూడు రకాల యాంటీఆక్సిడెంట్‌లున

Written By Selvi
Updated: మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:49 IST)
ఆకుకూరల్లో ప్రధానం పాలకూర. పాలకూరలో పోషకాలు సమృద్ధిగా వుంటాయి. విటమిన్‌ ఏ, సీ, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియంలు అధిక మోతాదులో ఉన్నాయి. అలాగే ఇందులో పదమూడు రకాల యాంటీఆక్సిడెంట్‌లున్నాయి. అయితే మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే... పాలకూర అనేక పోషకాలను అందిస్తుందని.. దానివల్ల మనిషికి వయసుతో పాటు వచ్చే మతిమరుపు వ్యాధిని దూరం చేస్తుంది.
 
కావలసిన పదార్ధాలు :
కందిపప్పు : ఒక కప్పు 
పాల కూర : చిన్నవి ఐతే రెండు కట్టలు
చుక్క కూర : ఒక కట్ట
పచ్చి మిర్చి : 6-8
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు 
టమోటా : ఒక కప్పు
పసుపు : అర టీ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
 
పోపు కోసం:
వెల్లుల్లి రెబ్బలు: 4-6
ఎండుమిర్చి : రెండు
ఇంగువ : చిటికెడు
నెయ్యి : రెండు టీ స్పూన్లు 
కరివేపాకు : రెండు రెమ్మలు
జీల కర్ర : ఒక టేబుల్ స్పూన్ 
ఆవాలు : ఒక టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా పాలకూరను ముక్కలుగా తరగాలి. తర్వాత పప్పుని కుక్కర్లో వేసి కడిగి అందులో ఆకుకూరముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన ఆకుకూర పప్పులో ఉప్పు వేసి గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి బాగా మెదపాలి.

తర్వాత చిన్న బాణలిలో నెయ్యి వేసి ఒక నిమిషం తరువాత వెల్లుల్లి రేకులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీల కర్ర, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. చివరగా ఇంగువ కూడా వేసి వేయించి, పప్పులో వేసి వెంటనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి. అంతే ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర పప్పు రెడీ.

అన్నీ చూడండి

అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ కుటుంబం

అనిరుధ్-కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్-రజినీకాంత్-స్టాలిన్

హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ

హైదరాబాద్ నగరానికి అప్పుడేమో మెస్సీ.. ఇప్పుడు రొనాల్డో.. రేవంత్ రెడ్డి

పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య

అన్నీ చూడండి

సామాజిక మార్పు కోసం పోరాడిన పూలే చిత్రం విడుదలకు సిద్ధమైంది

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్

Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్

తర్వాతి కథనం
Show comments