వీకెండ్ స్పెషల్: హెల్దీ పనీర్ బిర్యానీ టేస్ట్ చేయండి

శనివారం, 18 ఏప్రియల్ 2015 (14:01 IST)
పనీర్ ఎముకలకు, దంతాలకు బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రాణాంతక వ్యాధులైన గుండెపోటు, క్యాన్సర్‌‌ను దూరం చేస్తుంది. అలాంటి పనీర్‌తో ఈ వీకెండ్ బిర్యానీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
 
కావల్సిన పదార్థాలు: 
పనీర్: 300 గ్రాములు 
రైస్: అరకేజీ 
గరం మసాలా పౌడర్: ఒక టీ స్పూన్ 
ఏలకుల పొడి: రెండు టీ స్పూన్ 
బిర్యాని ఆకు: కొంచెం 
లవంగాలు: రెండు
మిరియాల పొడి : అర స్పూన్ 
నిమ్మరసం : అర కప్పు  
కుంకుమపువ్వు: అర టీ స్పూన్ 
బఠానీలు: ఒక కప్పు 
అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్ 
పెరుగు: రెండు కప్పులు 
పచ్చిమిరపకాయల తరుగు: అర కప్పు 
పసుపు: పావు టీ స్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
పాలు: పావు కప్పు 
కొత్తిమిర తరుగు : అరకప్పు 
పుదీనా ఆకులు: ఒక కప్పు 
నెయ్యి: రెండు టీ స్పూన్లు 
ఉప్పు: రుచికి సరిపడా
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అందులో ఉప్పు, బిర్యానీ ఆకులు, లవంగాలు కొద్దిగా మిరియాల పొడివేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత పెరుగు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసంను ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
 
అదే బౌల్లో పన్నీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో బౌల్లో పాలు పోసి అందులో కొద్ది కుంకుమ పువ్వు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. అన్ని సిద్దం చేసి పెట్టుకొన్నాక, స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తూ, కొన్ని నిముషాల ఫ్రై చేసిన తర్వాత అందులో పనీర్ ముక్కలను వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి.
 
తర్వాత వెడల్పాటి పాన్ తీసుకొని అందులో ముందుగా వండి పెట్టుకొన్న రైస్ ఒక లేయర్‌గా వేసి పాన్ మొత్తం సర్ధాలి. తర్వాత రైస్ లేయర్ మీద పనీర్‌ను కూడా వేసి, రైస్ మొత్త కవర్ అయ్యేలా సర్దాలి. ఇప్పుడు దీని మీద ముందుగా ఉడికించి పెట్టుకొన్న పచ్చిబఠానీలు, గరం మసాలా పౌడర్, యాలకలపొడి, కుంకుమపువ్వు, పాలు, కొత్తిమీర, పుదీనా మరియు నెయ్యి వేయాలి.
 
ఇలా మొత్తం అన్నం, పన్నీర్ గ్రేవీ లేయర్స్‌గా సర్దుకుంటూ పూర్తి చేసుకొన్న తర్వాత మూత పెట్టి మరో 10 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకుని దించేయాలి. అంతే పనీర్ బిర్యానీ రెడీ.. ఈ బిర్యానీకి కడాయ్ చికెన్ కాంబినేషన్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. 

అన్నీ చూడండి

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

వైఎస్ జగన్‌ను కలిసిన కొడాలి నాని.. ఫోటోలు వైరల్

ప్రధాని మోడీ పొదుపు మంత్రం - ఎద్దుల బండిపై పోలీస్ కానిస్టేబుల్ బారాత్

ప్రేమికుల పెళ్లి విషయంలో రూ. 70 వేల లంచం అడిగిన ఎస్సై, ACBకి పట్టించారు

అరుదైన ఖనిజ నిక్షేపాలలో సుమారు 30 శాతం వాటాను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్: B2K విశ్లేషణ

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

Show comments