Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

Written By సిహెచ్
Updated: ఆదివారం, 24 ఆగస్టు 2025 (22:32 IST)
గణేశుడిని పూజించే ముందు అనేక శ్లోకాలు పఠిస్తారు. వీటిలో ఎక్కువగా పఠించేవి రెండు శ్లోకాలు. వాటిలో మొదటిది...
 
వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా
 
భావం: ఓ వంకర తొండం కలవాడా, మహా స్వరూపం కలవాడా, కోటి సూర్యుల తేజస్సు కలవాడా, నా దేవుడా, అన్ని పనులలోను నాకు ఏ ఆటంకాలు లేకుండా చేయి.
 
రెండో శ్లోకం...
శుక్లాంభరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే
 
భావం: తెల్లని వస్త్రాలు ధరించినవాడు, వ్యాపకుడైనవాడు, చంద్రుని వంటి వర్ణం కలవాడు, నాలుగు భుజాలు కలవాడు, ప్రసన్నమైన ముఖం కలవాడు అయిన గణపతిని ధ్యానిస్తున్నాను. అన్ని ఆటంకాలు తొలగించమని కోరుకుంటున్నాను.
 
ఈ రెండు శ్లోకాలు సాధారణంగా ఏ పూజ ప్రారంభంలోనైనా, ముఖ్యంగా గణేశుడి పూజ సమయంలో పఠిస్తారు. వీటిని పఠించడం వల్ల పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని నమ్ముతారు.

అన్నీ చూడండి

బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలంగాణాలో విస్తారంగా వర్షాలు

జంక్‌ఫుడ్.. పిల్లల కడుపులో పరాన్నజీవులు.. అల్ట్రాసౌండ్ తరహా స్కాన్.. టీచర్ ప్రయత్నం సరైందేనా? (video)

విద్యార్థిని ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధించిన ఉపాధ్యాయుడు.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు

Truck Attack: భూవివాదం.. ఇంటిపై బొలెరో పికప్ వాహనం ఢీకొట్టి.. వృద్ధురాలిని చంపేశారు.. (video)

బీఎండబ్ల్యూ కారు యజమానిని డబ్బు కోసం వేధించిన ట్రాన్స్‌జెండర్లు (వీడియో)

అన్నీ చూడండి

12-09-2026 శనివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలి

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు

11-09-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. ఆరోగ్యంపై శ్రద్ధ.. విశ్రాంతి అవసరం..

10-09-2026 గురువారం మీ రాశి ఫలితాలు.. పనిభారం పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments