1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (15:09 IST)

సీరియళ్లు బోర్.. స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లిన మహిళలు.. పురుషుల కంటే వీరే టాప్

మహిళలు టీవీ సీరియళ్ల కోసం టీవీలకు అతుక్కుపోయేకాలం మారింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌ అనే సంస్థ విడుదల చేసిన సర్వేలో తేలిందేమిటంటే? పురుషుల కంటే మహిళలే స్మార్ట్

మహిళలు టీవీ సీరియళ్ల కోసం టీవీలకు అతుక్కుపోయేకాలం మారింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌ అనే సంస్థ విడుదల చేసిన సర్వేలో తేలిందేమిటంటే? పురుషుల కంటే మహిళలే స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ సేపు ఉపయోగిస్తున్నారట. టీవీల కంటే మహిళలు స్మార్ట్ ఫోన్లనే తెగ వాడేస్తున్నారని ఈ సర్వేలో తేలింది.
 
టీవీ చూసే సయమం కంటే వీడియో గేమ్స్‌ ఆడటం, యూట్యూబ్‌ చూడటం వంటి వాటిపైనే మహిళలు ఎక్కువ సయమం వినియోగిస్తున్నారని సర్వేలో తేలిపోయింది. భారత్‌లోని వినియోగదారులు సగటున మూడు గంటలు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 2015తో పోలిస్తే 55శాతం ఎక్కువ. ఇందులో సోషల్‌మీడియా, మెసేజింగ్‌ యాప్స్‌దే సింహభాగమని తేలింది. 
 
ఇక పురుషులతో పోలిస్తే మహిళలు దాదాపు రెట్టింపు సమయం గేమ్స్‌, యూట్యూబ్‌పై సమయం వెచ్చిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు కూడా వినియోగం పెరిగిందని సర్వేలో తేలిపోయింది.