Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూత్‌పేస్ట్‌లో వంటసోడా కలిపి అక్కడ రాసుకుంటే..?

Updated: బుధవారం, 19 డిశెంబరు 2018 (17:46 IST)
చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ పెదాలు మాత్రం రంగు మారనే మారవు. ఈ సమస్య మహిళలకే ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు చిట్కాలు తెలుసుకుంటే.. పెదాలను గులాబీ రంగుల్లో మార్చొచ్చని బ్యూటీషన్లు చెబుతున్నారు.
 
1. మీరు ప్రతిరోజూ పళ్లు తోముకునే టూత్‌పేస్ట్‌ను పెదాలు రాసుకోవాలి. ఇప్పుడు టూత్ బ్రష్‌తో పెదాలను రుద్దుకోవాలి. ఇలా నెలరోజుల పాటు క్రమంగా చేస్తే పెదాలు గులాబీ రంగుల్లో అందంగా తయారవుతాయి. 
 
2. సాధారణంగా ప్రతీ స్త్రీ ముఖానికి పసుపు రాసుకుంటుంది. ఈ పసుపు అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ, చేతి గోర్లను మాత్రం చెడిపేస్తుంది. గోర్ల మధ్యలో పసుపుగా.. వాటిని చూడడానికే విసుగుగా ఉంటుంది. దీనిని ఎంత శుభ్రం చేసినా పోలేదంటే.. టూత్‌పేస్ట్‌ను గోర్లకు రాసుకుని కాసేపు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత మెత్తని గుడ్డతో తుడుచుకుంటే గోర్లు ముందు ఎలా ఉన్నాయో అలా మారుతాయి. 
 
3. మహిళలకు శరీర వేడి కారణంగా ముఖంపై మొటిమలు విపరీతంగా వస్తుంటాయి. వాటిని తొలగించాలంటే.. కలబంద గుజ్జులో కొద్దిగా టూత్‌పేస్ట్ కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత కడుక్కుంటే.. మొటిమలు పోతాయి. ఇలా వారం పాటు చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. 
 
4. ముక్కుపై నల్లటి వలయాలు, మచ్చలు తొలగించాలంటే.. టూత్‌పేస్ట్‌లో స్పూన్ వంటసోడా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముక్కుకు రాసుకుని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడురోజుల పాటు చేస్తే నల్లటి ఛారలు పోతాయి. 
 
5. జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. అల్లం రసంలో కొద్దిగా ఉల్లిపాయ రసం కలిపి జుట్టుకు పూతలా పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా నెలరోజుల పాటు వారంలో ఒక్కసారి చేసిన జుట్టు రాలకుండా ఉంటుంది.  

అన్నీ చూడండి

నా జీవితాన్ని ప్రధాని మోడీ నరకం చేశారు : రుచికా సింగ్ (వీడియో)

అత్యాచారాన్ని ప్రతిఘటించిన నర్సు ... చంపేసిన కామాంధుడు

మత్తు రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలి : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

గదిలో ఏకాంతంగా ప్రియుడితో దొరికిన భార్య.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్త హత్య

ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి - నిలిచిన 1643 మంది చిన్నారుల ప్రాణాలు

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments