Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో చర్మం నిగారింపు కోసం.. ఇలా చేయాలి..?

Updated: మంగళవారం, 8 జనవరి 2019 (13:26 IST)
శీతాకాలంలో చర్మం నిగారింపు కోల్పోయి పలురకాల సమస్యలు ఎదుర్కుంటారు. అంతేకాదు.. ముఖం ముడతలుగా, ఏవేవో మచ్చలు ముఖం చూడడానికే విసుగుగా ఉంటుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.. మరి అవేంటో తెలుసుకుందాం..
 
చలికి ముఖం పగిలి ఎర్రగా మారిందంటే.. ఆ ప్రాంతాల్లో గ్రీన్‌టిన్‌టెడ్ మాయిశ్చరైజర్‌ని రాస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా ఈ చలికాలంలో చర్మం పగిలిపోయే కాలం కాబట్టి మ్యాటీ తరహా లిప్‌స్టిక్‌లు వేసుకోకూడదు. ఒకవేళ సన్‌స్క్రీన్ ఉంటే టిన్‌టెడ్ లిప్‌బామ్‌లకు ప్రాధాన్యం ఇవాల్సి ఉంటుంది. అలానే పాడైనా చర్మానికి ఏ అలంకరణ చేసినా బాగుండదు. 
 
ఈ చలికాలంలో చర్మం నిరాగింపును సంతరించుకోవాలంటే.. పాలు, పెరుగు తీసుకోవాలి. ఈ రెండు చర్మంలోని మృతుకణాలను దూరం చేస్తాయి. ముఖం పగిలి పొలుసులుగా రాలకుండా ఉండాలంటే.. 2 స్పూన్ల తేనెలో కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే.. తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చును.
 
ఇంకా చెప్పాలంటే.. టమోటాలను గుజ్జుగా చేసుకుని అందులో 2 స్పూన్ల నిమ్మరసం కొద్దిగా తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 20 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఆపై నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే ముఖం ముడతలు పోతాయి. దాంతో చర్మం మృదువుగా, తాజాగా తయారవుతుంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments