సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (08:59 IST)

రష్యా బ్యూటీతో పెళ్లి.. మలేషియా రాజు రాజీనామా

మలేషియా రాజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ రాజప్రసాదం అధికారులు అధికారికంగా వెల్లడించారు. దీంతో గతవారం రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టయింది. 
 
మలేషియా బ్రిటన్ నుంచి 1957లో స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుంచి ఒక రాజు తన పదవికి రాజీనామా చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రాజుగా ఉన్న సుల్తాన్ ముహమ్మద్ వి రష్యాకు చెందిన మాజీ అందగత్తెను పెళ్లి చేసుకున్నట్టు పుకార్లు వచ్చాయి. వీటికి తెరదించుతూ ఆయన పదవికి రాజీనామా చేశారు. 
 
ఈనెల 6వ తేదీ నుంచి దేశ 15వ రాజుగా ఉన్న సుల్తాన్ ఆ పదవికి రాజీనామా చేసినట్టు మలేషియా నేషనల్ ప్యాలెస్ విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. అయితే, 49 యేళ్ళ రాజు రాజీనామాకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.