Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గృహిణి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివి

ఈ వంటింటి చిట్కాలను అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు. తక్కువ టైంలోనే సులభంగా వంటింటి చిట్కాలను చూస్తూ మీరు చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం రండి వంటింటి టిప్స్ లను నేర్చుకుందాం, మంచి చిట్కాలను ఉపయోగించి ఇ

Written By Kowsalya
Updated: బుధవారం, 30 మే 2018 (17:18 IST)
ఈ వంటింటి చిట్కాలను అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు. తక్కువ టైంలోనే సులభంగా వంటింటి చిట్కాలను చూస్తూ మీరు చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం రండి ఈ చిట్కాలను ఉపయోగించి ఇంటిని, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. 
 
ఉల్లిపాయలు రెండుగా కోసి నీటిలో కొంచెం సేపు నానబెట్టి ఆ తరువాత కోసుకుంటే కళ్ళ వెంట నీళ్ళురావు. కోడి గుడ్లను ప్రెజర్ కుక్కర్‌లో ఉడికిస్తే దాని పైపెంకు సులువుగా ఊడి వస్తుంది. కూరలలో కారం ఎక్కువైతే వాటిల్లో కొంచెం టమాటో రసం కలపితే చాలు. పెనంలో దోశలు అంటకుండా ఉండాలంటే ముందుగా పెనానికి ఉప్పుతో తుడిచి ఆ తర్వాత నూనెను రాసుకుని దోశలు చేసుకుంటే అవి పెనానికి అంటుకోవు.
 
క్యాబేజీ కూర చేసుకునేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్కను ఆ పాత్రలో వేస్తే వాసనరాదు. పప్పు త్వరగా ఉడకాలంటే అది ఉడికేటప్పుడు ఆ పాత్రలో నూనెగాని, డాల్డాగాని వేస్తే త్వరగా ఉడుకుతుంది. బట్టలపై పడ్డ ఇంకు మరకలు పోవాలంటే వాటిపై టూత్ పేస్ట్ గాని, నిమ్మరసం గాని వేసి రుద్దితే ఇంకు మరకలు తొలగిపోతాయి.
 
కత్తిపీటకు పదును తగ్గిపోతే దానికి కొంచెం ఉప్పును రెండువైపుల రాస్తే పదునెక్కుతుంది. వడియాలు తెల్లగా రావాలంటే ఆ వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం కలుపుకుంటే చాలు. బంగాళా దుంపలు త్వరగా వేగాలంటే ఆ ముక్కలను మజ్జిగలో కొద్దిసేపు ఉంచిలి. పంచదార ఉబ్బాలో చీమలు పడుతున్నాయా అయితే ఆ డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చీమలు పట్టవు.
 
రేకు డబ్బాలను కిరోసిన్‌తో కడిగి తరువాత సబ్బుతో కడిగితే తుప్పు తేలికగా మాయమవుతుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే అందులో బంగాళాదుంప ముక్కలు, నీరు వేసి కలిపితే చాలు. అన్నం ముద్దవ్వకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు స్పూన్ వంట నూనెను వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది.
 
వంట చేసేటప్పుడు చేతులకు మరకలు అయితే బంగాళాదుంప ముక్కలతో రుద్దుకుని కడుక్కోవాలి. కూరగాయలు వడలిపోయి ఉంటే నిమ్మరసం కలిపిన నీటిలో కాసేపు ఉంచితే తాజాగా మారుతాయి. వంట గదిలోకి చీమలు రాకుండా ఉండాలంటే ఒక దోసకాయ ముక్కను కోసి చీమలు వచ్చే దగ్గర ఉంచితే చీమలు రావు.
 
చెక్క గరిటలు, స్పూన్లు వాసన రాకుండా ఉండాలంటే వెనిగర్ కలిపిన నీటిలో ఉంచి ఆ తర్వాత వాడుకుంటే వాసన రాకుండా ఉంటాయి. గారెలు, వడలు చేసేటప్పుడు నూనే చిందకుండా ఉండాలంటే ఆ నూనెలో కొంచెం నెయ్యి కలిపితే నూనే చిందకుండా ఉంటుంది. పెనానికి ఉన్న జిడ్డు వదలకుండా ఉన్నపుడు వేడినీళ్ళలో పెనాన్ని రెండుగంటలు ఉంటి ఆ తర్వాత నిమ్మచెక్కలతో రుద్దితే జిడ్డు తొలగిపోతుంది.
 
అల్లం, వెల్లుల్లిని కాగితంతో పొట్లం కట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం నిల్వఉంటాయి. ఫ్రిజ్‌లో ఉంచిన నిమ్మకాయను పది నిమిషాలు వేడినీటిలో ఉంచి కోస్తే రసంబాగా వస్తుంది. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఆ ముక్కలు కడిగే నీటిలో కొంచెం పాలు వేస్తే అవి నల్లబడవు. కందిపప్పు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఆ డబ్బాలో ఎండుకొబ్బరి చిప్పను ఉంచితే చాలు. 
 
పాలు పొంగకుండా ఉండాలంటే పాలు మరిగేటప్పుడు ఆ గిన్నెపై ఒక చెక్క గరిట, స్పూన్ లేదా గిన్నె అంచుగు నూనే రాస్తే పాలు పొంగవు. కాకరకాయ ముక్కలకు కొంచం ఉప్పును రాసి నీళ్ళు చల్లి ఒక గంటసేపు అలా ఉంచితే చేదుపోతుంది. పెరుగు పాడవకుండా ఉండాలంటే అందులో కొబ్బరి ముక్కను వేస్తేచాలు.
About Author
Kowsalya

అన్నీ చూడండి

రేణుకా స్వామి హత్య కేసు : అప్రూవర్‌గా ఏ14 - దర్శన్‌కు చిక్కులు తప్పవా?

ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ దారుణ హత్య...

ఆగష్టు 13, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?

శ్రీకాళహస్తిలో పోలీసును కత్తితో బెదిరించిన ఉన్మాదికి సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు, వీడియో

బొద్దింకలు పబ్లిక్ గార్డెన్‌లో మీట్ అవుతున్నాయి: ఢిల్లీ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు, వీడియో

అన్నీ చూడండి

Jr. NTR: మీ మద్దతు నాకు ప్రతిరోజూ బలాన్ని ఇస్తుంది : జూనియర్ ఎన్టీఆర్

సందీప్ రెడ్డి వంగా సినిమా రోమాంచకం టైటిల్ సాంగ్ రిలీజ్

సత్యజిత్ రే, రాజమౌళి సినిమాలు ఇష్టపడతాను : దర్శకుడు ఉదయ్ చౌహాన్

jony master :దళారులు లేకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు : టీ.జి. విశ్వ ప్రసాద్

రూరల్ ఎంటర్‌టైనర్‌గా శివకార్తికేయన్ చిత్రం సెయాన్ రెండో షెడ్యూల్ షురూ

తర్వాతి కథనం
Show comments