జగన్ మంత్రివర్గ కూర్పు చేసుకున్నారు... కానీ ఏమైంది? చంద్రబాబు జస్ట్ ఆస్కింగ్
సర్వేలు చేసుకోవడం అందరికీ అలవాటుగా మారింది. 1983 నుంచి సర్వేలు చేయించడం టీడీపీకి అలవాటు. నేను చెబుతున్నా రాసుకోండి.. నూటికి వేయి శాతం టీడీపీ గెలవబోతోంది అని చంద్రబాబు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ... నేను చెప్పగానే మధ్యాహ్నం నుంచి ఓటర్లు క్యూ లైన్లల్లో నిల్చున్నారు. పక్క రాష్ట్రాల నుంచి అందిన వాహనాన్ని తీసుకుని ఓటింగ్ కోసం వచ్చారు.
గతంలో టీడీపీ పోరాటం వల్లే వీవీ ప్యాట్ల విధానం వచ్చిందని మాజీ సీఈసీ ఖురేషీ చెప్పారు. వేగమా..? విశ్వసనీయతా..? అనే ప్రశ్న ఉత్పన్నం అయితే విశ్వసనీయతకే మొగ్గు చూపాలి. ఈవీఎంల విషయంలో సీఈసీగా పని చేసిన వ్యక్తులే తప్పుపడుతున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపులో ఏమైనా తేడా జరిగితే నియోజకవర్గం మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి.
ఎక్కడైతే తేడాలు వస్తాయో.. వాటి వివరాలు ఆన్‌లైన్లో పెట్టాలి. 17C ఫారాలను కౌంటింగ్ ఏజెంట్లు తీసుకెళ్లొచ్చు. పోలింగ్ సమయంలో సెంట్రల్ ఫోర్స్ పంపలేదు అని చెప్పారు. కౌంటింగ్ సమయంలో మాత్రం పంపుతున్నారు. ఈవీఎంలపై పరిష్కారం వచ్చేవరకు పోరాడతాం. ఈవీఎంలపై మా వాదనను అంగీకరించడానికి బీజేపీకి ఇబ్బందేమిటీ..? అని బాబు ప్రశ్నించారు.
గతంలోనూ ఇదే తరహాలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. వైసీపీకి ఒన్ సైడుగా ఇచ్చారు. వాళ్లు మంత్రివర్గ కూర్పూ చేసుకున్నారు.. కానీ ఏమైంది..? ఈసీ కూడా విశ్వసనీయత కొల్పోతోంది. ప్రస్తుతం ఈవీఎంలను కాపాడుకునే ప్రయత్నాల్లో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. ఇంతటి అనుమానాలు వచ్చేలా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిదా..? జాతీయ పార్టీలతో.. నాన్-బీజేపీ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. విడివిడిగా మాట్లాడుతున్నాం. కలకత్తా వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తాం అని బాబు తెలియచేసారు.