1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (15:51 IST)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

bjpjsp
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం ఈ మూడు పార్టీలు కలిసి రూపొందించిన ఎన్నికల్ మేనిఫెస్టోను రూపొందించింది. దీన్ని మంగళవారం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించనున్నారు.
 
ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం’, ‘పన్ను బాదుడు లేని సంక్షేమం - ప్రతి ప్రాంతం అభివృద్ధే లక్ష్యం’ తదితర నినాదాలతో ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని.. సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామనే హామీని దీని ద్వారా కూటమి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మూడు పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు.