పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకున్నాను.. తమన్నా సింహాద్రి
బిగ్‌బాస్ తెలుగు కంటెస్ట్, సామాజిక కార్యకర్త, నటి, ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమన్నా సింహాద్రి మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్‌పై పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇక తాజాగా భారతీయ చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా తమన్నా సింహాద్రి బరిలోకి దిగారు. అయితే తాను పోటీచేయడంపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతందో తెలియదు.
వ్యక్తిగతంగా ఉండే అంచనాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మారిపోతుంటాయి. తాను ఎప్పుడూ పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మా పార్టీ అధినాయకత్వం టికెట్ ఇచ్చి పోటీ చేయాలన్నారు. నేను మరో మాట ఆలోచించకుండా పోటీ దిగాను అని అన్నారు.
అయితే నేను పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకున్నాను. కానీ ఆయన సీఎం పరిస్థితిలో లేడు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పిఠాపురం స్థానాన్ని నేను ఎంచుకొన్నాను అని తమన్నా సింహాద్రి తెలిపారు.