సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (08:38 IST)

ఏపీలో టీడీపీ లీడ్.. గోరంట్ల బుచ్చయ్య 910 ఓట్లతో ముందంజ-కుప్పంలో చంద్రబాబు లీడ్

buchaiah chowdary
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గెలుపు ఖాతాను తెరిచింది. రాజమండ్రి రూరల్‌లో తెలుగుదేశం పార్టీ ముందంజలో వుంది. 910 ఓట్ల ఆధిక్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వున్నారు. 
 
ఆయన ప్రత్యర్థి గోపాలకృష్ణ 4885 ఓట్లు సాధించి.. బుచ్చయ్య కంటే 910 ఓట్లతో వెనకంజలో వున్నారు. యువజన సమైక్య రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన గోపాల కృష్ణ చెల్లుబోయిన (వేణు) బుచ్చయ్య కంటే వెనుకంజలో వున్నారు. కుప్పంలో తొలి లెక్కింపులో నారా చంద్రబాబు నాయుడు 1549 పోస్టల్ బ్యాలెట్లతో ముందంజలో ఉన్నారు.
 
రాజమండ్రి రూరల్‌లో ఈవీఎం తొలి రౌండ్‌లో టీడీపీ ఆధిక్యంలో నిలిచింది. అలాగే తెలంగాణలో బీజేపీ ఖాతా తెరిచింది. ఆదిలాబాద్‌లో బీజేపీ లీడింగ్‌లో వుంది.