సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మార్చి 2024 (14:48 IST)

విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్!!

vamsikishna srinivas yadav
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్టణం సౌత్ నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఈ స్థానం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జనసేన పార్టీ 21 అసెంబ్లీ, కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది. 
 
ఈ క్రమంలో ఇప్పటికే 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు. దీంతో జనసేన ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండింటిపై కూడా రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.