సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (21:42 IST)

'వారాహి విజయభేరి' మార్చి 30 నుంచి ప్రారంభం

pawan kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. మార్చి 30 నుంచి ఆయన 'వారాహి విజయభేరి' పేరుతో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. 
 
మొదటి బహిరంగ సభ మార్చి 30న చేబ్రోలులోని రామాలయం సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. పవన్ ప్రచార కార్యక్రమాల్లో భద్రతా వ్యవహారాల సమన్వయం కోసం అందె నరేన్, మిథిల్ జైన్‌లను నియమించారు. వీరి నియామకాన్ని పవన్ కళ్యాణ్ ఆమోదించారు.
 
ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర మూడు దశల్లో సాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ప్రచారంలో దూసుకెళ్తుండగా.. ఇప్పుడు పవన్, నారా లోకేశ్‌ల వంతు వచ్చింది. 
 
ప్రజా గళం యాత్ర పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైన చంద్రబాబు, "మేమంత సిద్ధం" నినాదంతో సీఎం జగన్ సభలకు హాజరవుతున్నారు.