బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (12:23 IST)

విశాఖలో కరోనా కలకలం... తాజాగా పది మందికి కరోనా వైరస్

corona visus
విశాఖపట్టణంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తాజా పది మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. పైగా ఇప్పటివరకు, అలాగే, రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
గత నెల నాలుగో తేదీన విశాఖలోని కంచరపాలెంకు చెందిన సోమకళ అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతుండగా, ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరితో పాటు ఇతరులకు కలిపి మొత్తం పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. 
 
మరోవైపు, చలి కాలం కావడంతో సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, మార్కెట్లు, ఆలయాలు, ప్రార్థనలకు వెళ్లే సమయాల్లో ముఖానికి మాస్క్ ధరించాలని కోరుతున్నారు. పైగా, జనవరి నెలలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.