Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?
ఏపీలో దోసె ముక్క చిక్కుకుని ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని అనంతపురం జిల్లా తపోవనంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరం తపోవనం ప్రాంతానికి చెందిన అభిషేక్, అంజినమ్మలకు రెండేళ్ల కుమారుడు కుశాల్.. శుక్రవారం ఉదయం దోసె తింటుండగా.. అనుకోకుండా అతని గొంతులో దోసె ముక్క ఇరుక్కుపోయింది.
దీనిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి ముక్కను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. కుశాల్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో, తల్లిదండ్రులు వెంటనే సర్వజనాసుపత్రికి తరలించగా.. కొద్ది సేపటికే బాలుడు మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.