ఏపీలో 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
ఏపీలో గడిచిన 24 గంటల్లో 222 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఈ మేరుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటిన్‌ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్ పరిశీలిస్తే 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇతర రాష్ట్రాలు (33), విదేశాల నుంచి (3) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 222 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 5636 కేసులు నమోదయ్యాయి.
మరో 42 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 1865కు చేరింది. మృతుల సంఖ్య 82కు చేరింది.