మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:46 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 415 కొవిడ్ కేసులు.. 6 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,944 పరీక్షలు నిర్వహించగా.. 415 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,356కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 584 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,45,276 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4,655 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.