శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (16:13 IST)

ఏపీలో ఐఏఎస్‌ల భారీ బదిలీ: ఏకంగా 57 మందిని బదిలీ చేశారు..

apgovtlogo
ఏపీలో ఐఏఎస్‌లను భారీగా బదిలీ చేసింది. మొత్తం 57 మందిని బదిలీ చేశారు. సీనియర్‌ అధికారులతో పాటు, ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. వీరిలో సీనియర్‌ ఐఏఎస్‌ ఆర్‌.పి.సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించారు. 
 
సౌరభ్‌గౌర్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనంతరామును మైనార్టీల సంక్షేమశాఖకు బదిలీ చేసింది. 
 
అలాగే విజయనగరం, కృష్ణా, బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం కలెక్టర్లను బదిలీ అయ్యారు. వీరిలో కృష్ణా జిల్లా కలెక్టర్ పీ రంజిత్ బాషా బాపట్ల జిల్లా కలెక్టరుగా బదిలీ అయ్యారు.