Webdunia - Bharat's app for daily news and videos

Install App

75 శాతం విరాళాలు భాజపాకే..!

Written By ఎం
Updated: గురువారం, 24 జూన్ 2021 (12:13 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. 2019-20 ఏడాదికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా ఆ పార్టీకి రూ.276.45 కోట్లు విరాళాలు వచ్చాయి. అన్ని పార్టీలకు వచ్చిన విరాళాలతో పోలిస్తే ఒక్క  భాజపాకే 76.17 శాతం విరాళాలు రావడం గమనార్హం.

అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి రూ.58 కోట్లు (15.98శాతం) వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌  నివేదిక వెల్లడించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన జాబితాలో జేఎస్‌డబ్ల్యూ, అపోలో టైర్స్‌, ఇండియా బుల్స్‌, దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్స్‌ ఉన్నాయి.

ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ అత్యధికంగా రూ.39.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. అపోలో టైర్స్‌ రూ.30 కోట్లు, ఇండియా బుల్స్‌ రూ.25 కోట్లు సమకూర్చాయి.

భాజపా, కాంగ్రెస్‌ కాకుండా మరో 12 పార్టీలకు ఎలక్ట్రోరల్‌ ట్రస్టుల ద్వారా రూ.25.46 కోట్లు అందాయి. ఈ జాబితాలో ఆప్‌, ఎస్‌హెచ్‌ఎస్‌, ఎస్సీ, యువ జన్‌ జాగృతి పార్టీ, జననాయక్‌ పార్టీ, జేడీయూ, జేఎంఎం, ఎల్జేపీ, ఎస్‌ఏడీ, ఐఎన్‌ఎల్డీ, జేకేఎన్‌సీ, ఆర్‌ఎల్డీ ఉన్నాయి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments