ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (09:21 IST)

నోట్లో గుడ్డలు కుక్కి... 80 యేళ్ళ వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 80 యేళ్ళ వృద్ధురాలిపై ఓ బాలుడు అత్యాచారానికి తెగబడ్డాడు. నోట్లో గుడ్డలు కుక్కి... ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లా జమాలియా అనే గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామంలో ఓ వృద్ధురాలు తన ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తూ వచ్చింది. ఆమె ఇంటి పక్కనే ఉన్న ఓ బాలుడు.. అర్థరాత్రి బాలుడు ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లాడు. ఆమె నిద్రిస్తుండగా, నోట్లో గుడ్డలు కుక్కి, తాళ్ళతో కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ.. ఆ బాలుడి దుశ్చర్య నుంచి తప్పించుకునేందుకు ఆ వృద్ధురాలి తీవ్రంగా ప్రతిఘటించింది. 
 
అయితే, ఆమె వేసిన కేకలు బయటకు వినిపించడంతో నిద్ర మేల్కొన్న కుటుంబ సభ్యులు బాలుడుని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. బాధిత వృద్ధురాలి కోడలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత వృద్ధురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.