శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (11:12 IST)

మానసికవికలాంగురాలిపై కామాంధుడి కీచకపర్వం

తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. నిద్రపోతున్న ఓ మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచానికి తెగబడ్డాడు. నిద్రపోతున్న ఆ యువతిని నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో కామాంధుడుని పట్టుకుని చితకబాదారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహబూబ్ నగర్ జిల్లా, బయ్యారం మండలంలోని ఓ గ్రామంలో రాత్రి మానసిక వికలాంగురాలు ఇంటి బయట నిద్రిస్తోంది. రాత్రి 10 గంటల సమయంలో అక్కడకు వచ్చిన ఓ కామాంధుడు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి ఎత్తెకెళ్లాడు. ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. 
 
నిద్ర నుంచి మేల్కొన్న కుటుంబసభ్యులు ఆమె కోసం ఇతర గ్రామస్తులతో కలసి గ్రామమంతా వెతికారు. చివరకు గ్రామ శివారులో ఆమె అచేతన స్థితిలో పడివుంది. ఆమెను చూడగానే గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో కామాంధుడిని పట్టుకుని అక్కడే చితకబాదారు. జరిగిణ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.