గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక .. ఎక్కడ?

new born baby
ఏపీలోని కడప జిల్లా వాల్మీకిపురంలోని గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఈ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 యేళ్ల బాలిక ప్రసవించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం బాలికకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆ బాలికను పాఠశాల సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. గర్భవతిగా తేల్చారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక తాహశీల్దారు ఫిరోజ్ ఖాన్, ఎస్ఐ బిందుమాధవిలు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. మరోవైపు ఆ బాలిక గర్భందాల్చడానికి బాలిక మేనమామే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.