బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (09:14 IST)

దగ్గు సిరప్ తాగి ఓ చిన్నారి గుండె ఆగిపోయింది.. ఎక్కడ?

cough syrup
cough syrup
దగ్గు సిరప్ తాగి ఓ చిన్నారి గుండె ఆగిపోయింది. ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. దగ్గు సిరప్ తాగిన 30 నెలల పాప ప్రాణాలు కోల్పోయింది. సిరప్ తీసుకున్న 20 నిమిషాల తర్వాత చిన్నారి గుండె ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే..  ముంబైకి చెందిన పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డా.డిలు మంగేష్కర్ రెండున్నరేళ్ల మనవడు డిసెంబర్ 15న దగ్గు, జలుబుతో బాధపడ్డాడు. 
 
అందుకు చిన్నారికి దగ్గు మందు ఇచ్చారు. అయితే మందు ఇచ్చిన 20 నిమిషాల తర్వాత చిన్నారి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. ఆపై ఊపిరి పీల్చుకోలేక ప్రాణాలు కోల్పోయింది.  ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అయితే దగ్గు సిరప్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణమైందని నిరూపించడం అంత సులభం కాదంటున్నారు వైద్యులు.  
 
మహారాష్ట్రలోని చిల్డ్రన్స్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా ఉన్న వైద్యుడు విజయ్ యెవాలే మాట్లాడుతూ, తాను నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులను సూచించలేదన్నారు.