గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (11:39 IST)

దగ్గు సిరప్ తాగిన 66 మంది చిన్నారులు మృతి.. భారత్ తయారు చేసిన..?

baby legs
పశ్చిమ ఆఫ్రికా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. దగ్గు సిరప్ తాగిన 66 మంది చిన్నారులు మృతి చెందారు. అది కూడా భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ తయారుచేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, 66 మంది చిన్నారుల మృతికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ప్రొమెథజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్స్‌మాలిన్‌ బేబీ కఫ్‌ సిరప్‌, మేకాఫ్‌ బేబీ కఫ్‌ సిరప్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరప్‌ అనే నాలుగు ఔషధాలపై డబ్ల్యూహెచ్‌వో మెడికల్‌ ప్రొడక్ట్‌ అలర్ట్‌ జారీ చేసింది. వీటిలో పరిమితికి మించి డైథిలిన్‌ గ్లెకోల్‌, ఇథిలిన్‌గ్లెకోల్‌ ఉన్నట్టు గుర్తించారు. 
 
ఇవి పరిమితి దాటితే విషపూరితంగా మారుతాయని మెడికల్‌ ప్రొడక్ట్‌ అలర్ట్‌లో పేర్కొంది. గాంబియా దుర్ఘటనపై సంబంధిత భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది.