శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 27 జులై 2019 (18:18 IST)

ఏకాంతంలో భార్యనే వీడియోలు తీశాడు.. బ్లాక్ మెయిల్ చేసి చివరకు?

వివాహితతోనో లేకుంటే ప్రేమికురాలితోనో అక్రమ సంబంధం పెట్టుకుని వారి వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి కటాకటాల పాలైన సంఘటనలు అనేకం చూసుంటాం. కానీ భార్యతో ఏకాంతంగా గడుపుతూ ఆమె వీడియోలను తీసి ఆమెనే డబ్బులు డిమాండ్ చేశాడో ప్రబుద్థుడు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా అరణి ప్రాంతానికి ఓ కంటి వైద్యురాలికి వివాహం కాగా కొన్నాళ్ళకు భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తరువాత ఆమె చిత్తూరు నగరంలోని దుర్గానగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ఈ యేడాది ఫిబ్రవరిలో రెండవ వివాహం చేసుకుంది. 
 
అతడు బెంగుళూరులో పనిచేస్తున్నాడు. ఈ దంపతులు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసుకున్నాడు భర్త. తరువాత వీడియో భార్యకు చూపించి 10 లక్షల రూపాయలు కట్నంగా ఇవ్వాలని లేకుంటే దాన్ని అందరికీ పంపుతానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెల్ ఫోన్‌ను లాక్కుని అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.