మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (18:59 IST)

రైతుల ఉసురు పోసుకుంటున్న సర్కారు : ఏ కోదండరెడ్డి

ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఏ కోదండరెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ గతంలో ఆరు సార్లు ఇచ్చి ఇబ్బందులు పెట్టారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ఇంత వరకు రైతు అంశాలపై చర్చను లేదు. రైతు సమన్వయ సమితి విధానాలను తాము వ్యతిరేకించాము.. 
 
రైతు బంధు ఎన్నికలకే పరిమితం కాకుండా అందరూ రైతులకు ఇవ్వాలి. రాజకీయం కోసం కాకుండా రైతు ప్రయోజనం కోసం ఉపయోగకంగా ఉండాలి. రెవిన్యూ రికార్డుల సవరణలో చాలా ఇబ్బందులు వచ్చాయి. మేము రాజకీయంగా మాట్లాడడంలేదు. రెండేళ్లు అయ్యింది, ఇంకా లక్షలాది మందికి పాస్ బుక్స్ రాలేదు. 11 లక్షల మంది బడుగులకు పుస్తకాలు రాలేదు. 
 
అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన సంఘటపై ఇంతవరకు ప్రభుత్వం కారణం చెప్పలేదు. ఒక వృద్ధ దంపతులు రెవెన్యూ ఉద్యోగులకు లంచాలు ఇవ్వడానికి భిక్షాటన చేసింది. చిగురుమామిడిలో కనకయ్య అనే రైతు నిజమైన రైతుకు పాస్ పుస్తకం ఇవ్వడానికి లంచం తీసుకొని కూడా ఇవ్వకపోతే అత్మహత్య చేసుకోవడానికే ప్రయత్నం చేస్తే ఆయన్ను జైల్లో పెట్టారు. 
 
కేటీఆర్ రెవెన్యూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదు. లక్షల మంది రైతాంగ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఫలితం అనుభవిస్తారు.