మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (18:40 IST)

పని మనిషిని అనుభవించాలని ఆమె భర్త హత్యకు ప్లాన్, పక్కాగా చిక్కాడు (video)

తన ఇంట్లో పని చేసే పనిమనిషిపై కన్నేసిన ఓ వ్యక్తి తన కోర్కె తీర్చాలని ఆమెను ప్రాధేయపడ్డాడు. అందుకు ఆమె.. విషయం తెలిస్తే నన్నూ, నిన్నూ నా భర్త చంపేస్తాడని చెప్పింది. దాంతో ఆమె భర్తను అడ్డు తొలగించుకుని లొంగదీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి అతడిని రంగంలోకి దింపాడు. ఐతే ప్లాన్ బెడిసికొట్టడంతో కటకటాల పాలయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే... తూ.గో చెందిన అచ్యుతరావు అనే వ్యక్తి తన కుటుంబంతో సహా విజయవాడ మాచవరం డౌన్లో నివాసం వుంటున్నాడు. అతడు ప్లంబర్ గా పనిచేస్తుండగా, భార్య సమీపంలోని సాయిసూర్య రెసిడెన్సీలో రెండో అంతస్తులో వుంటున్న సుబ్బారావు ఇంట్లో పనిచేస్తోంది. ఇతడిక్కడ ఒంటరిగా వుంటున్నాడు. ఆమె అతడి ఇంట్లో రోజూ ఇంటిపని, వంట పనిచేస్తూ వుంది.
 
ఒంటరిగా వున్న సుబ్బారావు ఆమెపై మోజుపడి తన కోర్కె తీర్చాలని అభ్యర్థించాడు. అందుకు ఆమె తన భర్తకు తెలిస్తే చంపేస్తాడని అంది. దాంతో ఇక లాభం లేదనుకుని ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసాడు. తన సొంత ఊరికి చెందిన గోపీ అనే వ్యక్తిని రంగంలోకి దించాడు. పని మనిషి భర్తను చంపితే లక్ష రూపాయలు ఇస్తానన్నాడు.
 
దానితో గోపీ మరో నలుగురిని తీసుకుని పీకల దాకా తాగి వున్న అచ్యుతరావును అటకాయించారు. తమ వాహనాన్ని ఢీకొట్టావంటూ అతడిని బెదిరించి తమ వాహనం ఎక్కించుకుని సీతానగరం బకింగ్ హామ్ కెనాల్ పై గుండిమెత కొత్త రోడ్డులోకి తీసుకెళ్లి అక్కడ అతడిని చితక్కొట్టారు.
 
ఆ తర్వాత గోపీ తెచ్చిన కత్తితో అతడి పీక కోయాలని ప్రయత్నిస్తుండగా అది పట్టు దప్పి ముఖంపై పడింది. దాంతో అతడు గావు కేకలు పెట్టాడు. ఆ కేకలను రోడ్డుపై ప్రయాణించేవారి విని ఆగారు. దాంతో వారంతా అచ్యుతరావును అక్కడే వదిలేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకి క్లూ దొరకలేదు. ఐతే బాధితుడు తనపై గోపీ అనే వ్యక్తి మాట్లాడటాన్ని, తన భార్య పనిచేస్తున్న సుబ్బారావుకి ఫోన్ చేయడం ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. సుబ్బారావుతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.