మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (18:13 IST)

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

sonu sood - cm babu
ప్రముఖ నటుడు సోనుసూద్ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్‌ ఛారిటీ  ఫౌండేషన్‌’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సోనూసూద్‌ ఫౌండేషన్‌ నాలుగు అంబులెన్స్‌లను అందించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్‌.. ఫౌండేషన్‌ అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం ప్రారంభించారు. 
 
కాగా, కరోనా మహమ్మారి సమయంలో సోనుసూద్ అనేక వేల మందికి తన వంతు సాయం చేసిన విషయం తెల్సిందే. అలాగే, తన కంపెనీల్లో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అలాగే, ఆపదలో ఉన్న అనేక మందిని ఆయన వివిధ రూపాల్లో ఆదుకుని తాను రీల్ హీరో కాదని రియల్ హీరో అని నిరూపించుకున్న విషయం తెల్సిందే.