బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. ఆపై తరచూ వేధింపులు
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా అనంతపురంలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై కామాంధుడు విరుచుకుపడ్డాడు. ఓ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళితే.. గుత్తి మండలంలోని టి.కొత్తపల్లికి చెందిన నిందితుడు నరేశ్ మూడు నెలల క్రితం బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆపై తరచూ వేధింపులకు పాల్పడుతూ హింసించాడు. అతడి వేధింపులను భరించలేని బాలిక విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నిందితుడిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.