గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:23 IST)

ఇక సుందర విజయవాడ

జాతీయ రహదారి కరెన్సీ నగర్ ప్రాంతములోని సర్వీసు రోడ్ నకు ఇరువైపుల అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేయుటతో పాటుగా డివైడర్ నందు ఏర్పాటు చేసిన మొక్కల మద్యన గల  ఖాళి ప్రదేశాలలో మొక్కలు ఏర్పాటుచేయాలని  నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఉద్యానవన అధికారులను ఆదేశించారు. 

నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ యం.జి రోడ్, బెంజి సర్కిల్, జాతీయ రహదారి, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్ తదితర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ తీరును పర్యవేక్షించిన సందర్భంలో కరెన్సీ నగర్ ప్రాంతములోని సర్వీసు రోడ్ నకు ఇరువైపుల అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేయుటతో పాటుగా డివైడర్ నందలి ఖాళి ప్రదేశాలలో మొక్కలు ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంలో నగరంలోని పలు ప్రదేశాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టాయిలెట్స్ ఆధునికరించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు సూచించారు.

తదుపరి వన్ టౌన్ బి.ఆర్.పి రోడ్, గణపతిరావు రోడ్, కె.టి.రోడ్, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్, కబేళ, సితార సెంటర్, బైపాస్ రోడ్ హెచ్.బి.కాలనీ, స్వాతి రోడ్ మొదలగు ప్రాంతాలలో పర్యటిస్తూ, కె.టి రోడ్ నందు జరుగుతున్న పైపులైన్ పనుల యొక్క పురోగతిని అధికారులను అడిగితెలుసుకొని పలు సుచనలు చేస్తూ, పనులు వేగవంతముగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అదే విధంగా గొల్లపూడి బైపాస్ రోడ్, కాంబ్రె రోడ్ నందు జరుగుతున్న ఫుట్ పాత్ ఆధునీకరణ పనులను పరిశీలించి నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, సత్వరమే పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.