శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (08:53 IST)

విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు

విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల నాలుగు నెలలుగా చెన్నైకు విమానాలు ఆగిపోయిన విషయం తెలిసిందే.

ఇటీవల విమానాల రాకపోకల సంఖ్యను 45 నుంచి 65 శాతానికి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) ఆచరణలో పెట్టడంతో, విజయవాడ-చెన్నై విమానాలు నడవటానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నైకు తొలి విమానం ప్రారంభం కానుంది.

ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి తొమ్మిది విమాన సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌కు నాలుగేసి చొప్పున నడుస్తుండగా, వారంలో రెండు రోజులు ఢిల్లీకి ఒక విమానం నడుస్తుంది.

తాజా నిర్ణయంతో చెన్నైకు ఒక విమానంతోపాటు హైదరాబాద్‌కు అదనంగా మరో విమానానికి అవకాశం ఇవ్వడంతో విజయవాడ నుంచి నడిచే విమానాల సంఖ్య 11కు చేరింది. ఈ రెండు విమానాలు ఒకేరోజు ప్రారంభం కానున్నాయని ఎయిర్‌ పోర్టు అథారిటీ ప్రకటన విడుదల చేసింది.