బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated : సోమవారం, 5 జులై 2021 (16:12 IST)

సీఐడీకి వీడియో సాక్ష్యాలు అందించిన ఎమ్మెల్యే ఆర్కే.. భూముల్ని లాక్కున్నారు..

అమ‌రావ‌తి రాజ‌ధాని కోస‌మ‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు, ఆయ‌న తాబేదారులైన అధికారులు దళితులను బెదిరించి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. 
 
దీనికి ఇదిగో సాక్ష్యం...అంటూ వీడీయో సాక్ష్యాలను సీఐడీ అధికారులకు ఇచ్చారు. అమరావతి రాజధాని భూముల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని సి.ఐ.డి. అధికారుల‌ను ఎమ్మెల్యే ఆర్కే కోరారు. 
 
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు తమకు వత్తాసు పలికే అధికారులను అడ్డం పెట్టుకుని కారు చౌకగా దళితుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశార‌ని ఆర్కే ఆరోపించారు. 
 
అధికారులు ద‌బాయించి ద‌ళిత రైతుల భూముల్ని బినామీల పేరిట రాయించుకున్న‌ట్లు సంత‌కాలు కూడా తీసుకున్నార‌ని వీడియో సాక్ష్యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. అయితే, అవ‌న్నీ ఫేక్ వీడియో సాక్ష్యాల‌ని అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితి నాయ‌కులు ఖండిస్తున్నారు.