ఆంధ్రప్రదేశ్: బస్సులో చనిపోయిన వృద్ధుడు, శవాన్ని, భార్యను మధ్యలోనే దించేసిన ఆర్టీసీ సిబ్బంది: ప్రెస్ రివ్యూ

బిబిసి| Last Modified మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులో ఓవృద్ధుడు చనిపోయారు. మృతదేహాన్ని, వృద్ధుడి భార్యను సిబ్బంది దారి మధ్యలోనే దించేశారని ఈనాడు దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం చోటుచేసుకుంది.

సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పైడయ్య (82), పైడమ్మ దంపతులు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నారు. వారిద్దరూ కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని పత్రిక రాసింది. పలు ఆస్పత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో పార్వతీపురంలో నాటువైద్యం పొందేందుకు సోమవారం బస్సులో భార్యాభర్తలు బయల్దేరారు.

మార్గమధ్యంలో గుండెపోటుతో వృద్ధుడు చనిపోయాడు. దంపతులను బస్సు సిబ్బంది మధ్యలోనే బొబ్బిలి పెట్రోల్ బంక్ కూడలి వద్ద దించేసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడు కృష్ణదాస్, స్థానికులు కొందరు వారిని ఆటోలో స్వగ్రామానికి పంపించారని ఈనాడు రాసింది.దీనిపై మరింత చదవండి :