శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (16:21 IST)

అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. క్రమశిక్షణగా?

కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయటికొచ్చిన అమిత్ షాకు హోదా సెగ తగిలింది

కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయటికొచ్చిన అమిత్ షాకు హోదా సెగ తగిలింది. అమిత్ షా గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో వెనక్కి తగ్గిన బీజేపీ పార్టీకి అమిత్ అధ్యక్షుడు కావడంతో పాటు ఆయన తిరుమల రావడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. 
 
అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర టీడీపీ కార్యకర్తలు అమిత్ షా రాకను నిరసిస్తూ.. నల్ల జెండాలను ప్రదర్శించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అలిపిరిలో ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ తుంగలో తొక్కిందన్నారు.
 
అమిత్‌షా తిరుమల పర్యటన నేపథ్యంలో నిరసనకారులు ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనకు దిగారు. తిరుగు ప్రయాణంలో అమిత్‌షా కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్లదాడికి చేశారు. అమిత్ షాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తల ప్రయత్నించారు. బీజేపీ నేతల వాహనాలపై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పటిష్ట భద్రత మధ్య అమిత్ షా ఎయిర్ పోర్టు చేరుకున్నారు. 
 
అయితే అలిపిరిలో టీడీపీ కార్యకర్తలు అమిత్‌షా వాహనంపై దాడికి ప్రయత్నించిన ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కార్యకర్తలను ఆదేశించారు. పార్టీకి చెడ్డపేరు వచ్చే ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని తమ పోరాటంలో ఘర్షణలు, ఉద్రిక్తత చోటుచేసుకోకూడదని వార్నింగ్ ఇచ్చారు.