బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (19:05 IST)

తిరుపతిలో గర్భిణీలపై కరోనా పంజా.. ఏపీలో కోవిడ్ విజృంభణ

తిరుపతి నగరంలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. దీంతో చాలా మంది గర్భిణీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే కరోనా సోకిన గర్భిణీలను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదు.

ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల వైద్యులు ఇప్పటివరకూ 70 నార్మల్, 70 సిజేరియన్ డెలివరీలు చేశారు. ప్రసవాలు చేసిన వైద్య బృందంలో ఒక గైనిక్ సర్జన్, ముగ్గురు పీజీలు, ఐదుగురు నర్సులు కోవిడ్‌కు గురయ్యారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రోజురోజుకూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10004 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 434771కు పెరిగింది. ప్రస్తుతం 100276 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇప్పటి వరకు కరోనా నుంచి 330526 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3969కు చేరింది. 24 గంటల్లో 8,772 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,22,912 శాంపిల్స్‌ పరీక్షించారు.