గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (19:25 IST)

ఇక లాభం లేదు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తా : బాలకృష్ణ.. ఎందుకో? (video)

నటసింహం నందమూరి బాలకృష్ణకు కోపం వచ్చింది. ఒక సినీ హీరోగానే కాకుండా, అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ సభ్యుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. దీంతో ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏమైనా చేసేందుకు ఆయన సిద్ధపడ్డారు. ముఖ్యంగా, ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని సైతం కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు ఏపీలో సంచలనం రేపుతున్నాయి. 
 
సోమవారం హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి అవసరమైన రూ.55 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఓ మోస్తరు విమర్శలు చేశారు. 
 
అభివృద్ధి కంటే కూడా ఎక్కువగా కక్ష సాధింపులపైనే దృష్టి సారిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం హయాంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయం ఎక్కువగా ఉండేదన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలసి పని చేస్తేనే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలసి పని చేయాల్సి ఉందని చెప్పారు.