గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (23:12 IST)

సీఎం జగన్ వెన్నులో వణుకు?? సభలు, ర్యాలీలు, రోడ్డు షోలపై మార్గదర్శకాలు (video)

road shows
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్‌షోలకు ప్రజలు విపరీతంగా తరలి వస్తున్నారు. దీంతో కందుకూరులో తొక్కిసలాట చోటు చేసుకుంది. అలాగే, గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సభకు కూడా భారీసంఖ్యలో ప్రజలు వచ్చారు. ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఈ రెండు ప్రమాదాల్లో పది మంది వరు ప్రాణాలు కోల్పోయారు. 
 
పైగా, ఒక్క పైసా డబ్బు పంచకుండానే జనాలు విపరీతంగా తరలి వస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలకు నిద్రపట్టడంలేదు. దీంతో ఏ విధంగా చంద్రబాబు రోడోషోలను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఇందులోభాగంగా, రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ఏపీ హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
 
ఈ ఆదేశాల మేరకు మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీస్ యాక్ట్ నిబంధనలను వర్తింపజేశారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రోడ్డుకు దూరంగా ప్రజలు ఇబ్బంది లేని ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. సభలు, రోడ్‌షోలు నిర్వహించే రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాల ఎంపికపై సూచనలు పంపికపై సూచనలు పంపారు. ట్రాఫిక్‌కిు ఇబ్బంది కలిగించకుండా చూడాలని హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇబ్బంది లేని ప్రదేశాల్లో సభల నిర్వహణకు అనమతి ఇవ్వాలని నిర్ణయించారు.