శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (19:21 IST)

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 సినిమా చేస్తున్నారు. తాజాగా  అన్నపూర్ణ స్టూడియోలో యాక్షన్‌ సీన్స్‌ జరుగుతున్నాయి. దర్శకుడు బోయపాటి చాలా కేర్‌ తీసుకుని  అఖండ సీక్వెల్‌ చేస్తున్నాడు. కాగా, అఖండ వంటి సినిమా కథల ఎంపికలో ఆయన కుమార్తె తేజస్విని పాత్ర వుందనీ, ఇకపై తన తండ్రి కథలు ఎలా వుండాలో సూచనలు చేస్తుందట. ఇక బాలకృష్ణ గురించి డేట్స్‌ను తేజస్విని  భర్త చూసుకుంటున్నాడు. 
 
కాగా, నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 28 కోట్ల పారితోషికం తీసుకుంటున్న బాలకృష్ణ తాజాగా అఖండ 2కు  35 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఖుషీగా వున్న బాలకృష్ణ ఇటీవలే సంగీత దర్శకుడు థమన్‌ కు ఖరీదైన కారును కూడా గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా, అఖండ 2 తాండవంలో రెండో పాత్ర శివుని  భక్డుతుడుగా వుంటుందట. ఇటీవలే మహాకుంభమేళాలో అందుకు సంబంధించిన సన్శానివేశాలు చిత్రీకరించారు. తాజాగా దానికి కొనసాగింపుగా హైదరాబాద్‌ లో చిత్రీకరిస్తున్నారు.
 
దాకు మహారాజ్ సినిమా వంద కోట్ల క్లుబ్ లో చేరింది. హిందీలో ఈ సినిమా రిలీజ్ అయింది. త్యరలో ఓ.టి.టి. లో  రాబోతుంది.